జనం న్యూస్ డిసెంబర్ 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి జిల్లాలో జిల్లా, ఏరియా,సామాజిక ఆసుపత్రి లోపనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు కు ప్రభుత్వం జీవో ప్రకారం కనీస వేతనం అములు చేయాలనీఎ.పి మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించి డి సి హెచ్ శ్రీనివాసరావు, సూపరడెంట్ కృష్ణ రావుకు వినతిపత్రం సమర్పించారు. ఈసందర్బంగా లక్ష్మణ మాట్లాడుతూ జీవో 138 ప్రకారం శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ సిబ్బందికి రూ.16000/- వేతనంలో కార్మికుని పిఎఫ్, ఈఎస్ఐ వాటగా రూ.2040లు మినహాయించి రూ.13960/- ప్రతినెలా ఏడవ తేదీ లోపు చెల్లించాల్సి ఉంది. అలాగే సూపర్వైజర్లకు రూ. 21వేలు వేతనం చెల్లించాల్సి ఉంది. కానీ ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంగించి వేతనాలు చెల్లిస్తున్నారుఅని తెలిపారు. కార్మికులకు చట్టప్రకారం ఉద్యోగ నియామక పత్రం ఇవ్వాలి. అలాగే సం.కి 3 జతల యూనిఫామ్ మరియు నెలకు 4 వారాంతపు విశ్రాంతి దినములతో పాటు సం.కి 15 సాధారణ మరియు 15 రోజులు వేతనంతో కూడిన సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు.వైద్య సంస్థలలో రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా షిఫ్ట్ విధానం అమలు చెయ్యాలని కోరారు కార్యక్రమం లో ఏఐటీయూసీ నాయకులు బి. రవికుమార్ ఆసుపత్రి కార్మికులు వడ్డా ది పోల రావు, వడ్డా ది అప్పలరాజు, నూకరాజు,ఎర్రం శెట్టి వెంకట లక్ష్మి,వర లక్ష్మి, జ్యోతి,, నాగమణి, పద్మావతి, జగన్నాధం రావు, స్వాతి దుర్గ, తదితరులు పాల్గొన్నారు.


