Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో సంస్థల ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తామని కొప్పుల గ్రామ శాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీ ఆర్ ఎస్ పార్టీ బలోపేతానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో మండల వ్యాప్తంగా పార్టీ అభ్యర్థిలు ఘన విజయం కోసం కృషి చేస్తామని అన్నారు అనంతరం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ని పరకాల లో వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిశారు బీ ఆర్ ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి మండల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి మండల అధ్యక్షులు మనోహర్ రెడ్డి పరకాల మార్కెట్ వైస్ చైర్మన్ నందం మండల యూత్ అధ్యక్షులు మారపల్లి మోహన్ బీ ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు…..