జనం న్యూస్ 12 డిసెంబర్
జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్ మండల్‌లోని మల్చల్ మెతాండా గ్రామంలో సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా చౌహాన్ కిషన్ బరిలోకి దిగారు. గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజల నమ్మకం, ఆశీర్వాదాలు తనకు బలమని కిషన్ తెలిపారు.గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పారదర్శకతతో పరిష్కారాలు అందించడం, స్వచ్ఛమైన పాలన, పేదలకు ప్రాధాన్యత, గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.సిద్ధాంతాలు, పార్టీ లెక్కలు పక్కన పెట్టి గ్రామాభివృద్ధే తన ఏకైక ధ్యేయమని చెప్పిన చౌహాన్ కిషన్, మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకే వేసి విజయం సాధించి సేవ చేయడానికి సహకరించాలని గ్రామ ప్రజలను కోరారు.



