Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం న్యూఢిల్లీ లో నిర్వహించిన జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకలకు వెళ్లి శాయంపేట గ్రామానికి చెందిన దాసరి కల్పన స్వయం సహాయక సంఘ సభ్యురాలు హాజరైన విషయం తెలిసిందే తెలంగాణ నుండి 12 మంది పాల్గొన్నగా అందులో కేంద్ర మంత్రితో ముఖా ముఖిలో పాల్గొనే అవకాశం దాసరి కల్పన కు మాత్రమే దక్కింది సాధారణ పేద మహిళ స్వయం సహాయక సంఘాల ద్వారా ఈ ఘనత సాధించిన దాసరి కల్పన ను హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డీఆర్ డీఓ ఎం శ్రీను ఆడిర్డీఓ సుధీర్ డీసీఎం లు ఏపీఎం తదితరులు పాల్గొన్నారు….