జుక్కల్ డిసెంబర్ 12 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం లచ్చన్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి సతీష్ పటేల్ ప్రచారంలో ముందుకు సాగుతూ సర్పంచ్ గా ఒకసారి గెలిపిస్తే గ్రామంలో ఉన్న సమస్యలు, ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవ చేయడానికి ముందు ఉంటానని ప్రజలకు హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమం గానీ సామాజిక కార్యక్రమంలో గానీ ముందు వరుసలో ఉంటూ ప్రజాసేవకై తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ అశోక్ పటేల్, మాజీ ఎంపీపీ గంగారం, విజయ పటేల్ గ్రామస్తులు తదితరులు ప్రచారంలో పాల్గొంటూ సర్పంచిగా సతీష్ పటేల్ గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.



