జనం న్యూస్ 12డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.
జైనూర్:కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో దూసుకెళ్లిందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తెలిపారు. జైనూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడారు.గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. 90 శాతానికి పైగా సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకోవడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.ఎన్నిక ఏదైనా..విజయం కాంగ్రెస్ దే అని ప్రజలు మరోసారి నిరూపించారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు బందు, రైతు రుణమాఫీ వంటి పథకాల అమలు ప్రజలకు భారీ ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు. ఈ పథకాలే గ్రామీణ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెంచాయని తెలిపారు.రెండో, మూడో విడత ఎన్నికల్లో కూడా పార్టీ శ్రేణులు అదే ఉత్సాహంతో, ఐకమత్యంతో పనిచేయాలి.పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ విజయ పరంపరను కొనసాగించాలని పిలుపునిచ్చారు.గ్రామీణ అభివృద్ధి, సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం మరింత కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు అబ్దుల్ ముఖిత్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుమేత విశ్వనాథ్,సిర్పూర్-యు మండల అధ్యక్షుడు ఆత్రం శంకర్,లింగాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోయం ముకన్ కుమార్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజ్జులాల, అంబాజీ,హైమద్ ఖాన్ షేక్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కోవా సిద్దేశ్వర సుద్దాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


