జనం న్యూస్ 13 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 14న భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తైందన్నారు. దీన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్కు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.


