

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు ఓబిలి గ్రామానికి సంబంధించి S. ప్రవీణ్ అనే యువకుడికి క్యాన్సర్ వ్యాధి కారణంతో చికిత్స చేసుకుంటూ ఆర్థికంగా కొంత ఇబ్బంది కర పరిస్థితుల్లో ఉన్నట్టు అతని మిత్రులు లయన్స్ క్లబ్ నకు తెలియజేసి రోజువారి మందుల కొరకు కొంత ఆర్థిక సహాయం చేయమని తెలిపారు. ఈ విషయంపై క్లబ్ మెంబర్స్ తక్షణమే స్పందించి ఇవాళ ప్రవీణ్( క్యాన్సర్ పేషెంట్ )కు వరల్డ్ కాన్సర్ డే పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ₹. 10000/-( పదివేల రూపాయలు ) ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్ డాక్టర్ జయభాస్కరరావు మాట్లాడుతూ క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స ద్వారా నివారించుకోవచ్చని ఈ విషయంపై ప్రజలు అప్రమత్తతో ఉండాలని తెలియజేశారు.అనంతరం లయన్ మన్నెం. రామమోహన్ మాట్లాడుతూ క్యాన్సర్ సోకిన ప్రవీణ్ అనే ఈ యువకుడికి తిరుపతిలో ఉన్నటువంటి టాటా, మరియు డి.బి.ఆర్ క్యాన్సర్ హాస్పిటల్స్ నందు ఉచితంగానే వైద్య సౌకర్యం కలదని అందుకు మేము కూడా సహకరించగలమని తెలియజేస్తూ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు క్యాన్సర్ పరీక్షలు చేయించుకుని తద్వారా మొదటి దశలోనే క్యాన్సర్ సోకుతున్నట్లు గుర్తిస్తే నివారించుకునికుటుంబాలతో ఆనందంగా జీవించవచ్చని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బచ్చు జయ భాస్కరరావు, లయన్ మన్నెంరామమోహన్ SI, లయన్ కుర్రా మణి యాదవ్, కొత్తపల్లి రాజా చారి,దాసరినరసింహులు(అడ్వకేట్ )మోడపోతుల రాము, గంధం గంగాధర్ మరియు గుండు సురేష్ లు పాల్గొన్నారు