Listen to this article

జనం న్యూస్ 13 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సిబ్బందికి బ్రీఫింగ్ చేసిన – జిల్లా ఎస్పీ
తేది:14-12-2025 న జరగనున్న రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, మల్దకల్ , అయిజ మండలల్లో అధికారులకు మరియు సిబ్బందికి ఎన్నికల విధులపై సమగ్ర సమావేశని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు నిర్వహించబడమైనది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ … మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించడంలో పాల్గొన్న పోలీస్ సిబ్బంది, అధికారులు అందరి కృషిని జిల్లా ఎస్పీ హృదయపూర్వకంగా అభినందించారు. ఎన్నికల ప్రక్రియలో కట్టుదిట్టమైన బందోబస్త్, నిబంధనల అమలు, సమన్వయంతో విధులు నిర్వర్తించినందుకు సిబ్బందిని మెచ్చుకొని, ఇదే అంకితభావం తదుపరి దశ ఎన్నికలలో కూడా కొనసాగించాలని సూచించారు.పోలింగ్ బూతుల్లో భద్రత, రూట్ మొబైల్ టీంలు, రూట్ ఇన్చార్జులు, క్యూ.ఆర్.టీ స్ట్రైకింగ్ ఫోర్స్ మరియు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అన్ని రకాల ప్రత్యేక బృందాలు చేపట్టాల్సిన పనులు, నివారించాల్సిన అంశాలను స్పష్టంగా వివరించారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలను కఠినంగా పర్యవేక్షించి వెంటనే చర్యలు తీసుకోవాలి.అభ్యర్థులు, ఏజెంట్లు, రాజకీయ కార్యకర్తల ఒత్తిడి లేదా ప్రలోభాలకు లోనుకాకుండా పూర్తి నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి.పోలింగ్ స్టేషన్ల వద్ద అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, మద్యం/డబ్బు/ఉచితాలు పంపిణీ వంటి అక్రమాలపై నిఘా.ప్రతి ఓటరు స్వేచ్ఛగా, ఎలాంటి భయం లేకుండా ఓటు వేయగల వాతావరణాన్ని కల్పించాలి.చిన్న గొడవలనైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించి, శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలి.అత్యవసర సమాచారం అందిన వెంటనే పై అధికారులను అప్రమత్తం చేస్తూ, సమన్వయాన్ని పటిష్టంగా కొనసాగించాలి.సోషల్ మీడియాలో వ్యాపించే పుకార్లు, తప్పుడు సమాచారాన్ని పర్యవేక్షించి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
ఎన్నికల సమయంలో ఎటువంటి అక్రమాలు చోటుచేసుకోకుండా, ప్రతి పోలీస్ అధికారి సమన్వయంతో పనిచేసి ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
ప్రజల భద్రతే మా ప్రధాన ధ్యేయం. శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలను కఠినంగా అణచివేస్తాం. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలి” అని సూచించారు.రెండో విడత స్థానిక సంస్థలు ఎన్నికలు మొత్తం 74 గ్రామ పంచాయతీలలో 17 ఏకగ్రీవం కావడంతో మిగిలిన 57 స్థానాలలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగుతున్నానవి. వాటిలో 40 సమస్యాత్మక 48 సాధారణ 88 పోలింగ్ లొకేషన్ లలో 568 పోలింగ్ స్టేషన్లను ఉండగా దీనికి మొత్తంగా 380 మంది పోలీస్ ఫోర్స్ కు గాను 20 రూట్ మొబైల్ పార్టీలు, 4 స్ట్రైకింగ్ ఫోర్స్, 2 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ లు, క్యూ ఆర్.టి.లు 4, రూట్ ఇంచార్జ్ లు13 మందిని మిగిలిన సిబ్బందిని పోలింగ్ కేంద్రంలలో నియమించడం జరిగింది .ఈ కార్యక్రమంలో డి.ఎస్పీ. వై మొగిలయ్య, గద్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు టంగుటూరి శ్రీను, ఇన్స్పెక్టర్లు మరియు ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.పి ఆర్ ఓ జిల్లా పోలీస్ కార్యాలయం, జోగులాంబ గద్వాల జిల్లా.