

- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 04 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం మండలం కోరుకొండ సైనికల్ స్కూలులో 8వ తరగతి చదువుతున్న ఉత్కర్ష్ బనాకా (13సం.లు)
అనే విద్యార్ది తప్పిపోగా, విజయనగరం రూరల్ పోలీసులు అతడిని అగర్తలాలో కనుగొని, వారి తల్లిదండ్రులకు
జిల్లా పోలీసు కార్యాలయంలో అప్పగించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఫిబ్రవరి 3న తెలిపారు.
కోరుకొండ సైనిక్ స్కూలులో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్ధి ఉత్కర్ష్ బనాక (13సం.లు)
కనిపించుట లేదని సైనిక్ స్కూలు స్టాఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరం రూరల్ పోలీసులు బాయ్ మిస్సింగు కేసు
నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారన్నారు. మోహన్ బనాక, స్మిత దంపతుల కుమారుడు ఉత్కర్ష్ (13 సం.లు) ప్రస్తుతం
కోరుకొండ సైనిక్ స్కూలులో 8వ తరగతి చదువుతూ, సంక్రాంతి సెలవులకు వారింటికి హైదరాబాద్ వెళ్ళారు. సెలవులు
వినియోగించుకున్న తరువాత కోరుకొండ సైనికు స్కూలుకు వచ్చేందుకుగాను ఉత్కర్ష్ బనాక జనవరి 18న హైదరాబాద్
నుండి విజయనగరం వచ్చేందుకు నాగావళి ట్రైను ఎక్కారన్నారు. జనవరి 19న సైనిక్ స్కూలుకు సదరు విద్యార్ధి చేరుకోవాల్సి ఉండగా, కుమారుడి నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో తండ్రి మోహన్ బనాకా సైనికు స్కూలు
ఫోను చేయగా, ఇంకనూ ఉత్కర్ష్ బనాక సైనికు స్కూలుకు చేరలేదని తెలపగా, విద్యార్థి తండ్రి సూచనలతో విజయనగరం రూరల్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా, పోలీసులు బాయ్ మిస్సింగు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ కేసు విషయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రత్యేక శ్రద్ధ కనబర్చి, ఆర్.పి.ఎఫ్, జి.ఆర్.పి. మరియు స్థానిక పోలీసులను అప్రమత్తం చేసి, అన్ని విభాగాలకు అబ్బాయి వివరాలు పంపి, కేసును ఎప్పటికప్పుడు స్వయంగా
పర్యవేక్షించారన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది పలు ప్రాంతాల్లో విచారణ చేసి, కనిపించకుండా పోయిన ఉత్కర్ష్
బనాక (13సం.లు)ను చివరకు అగర్తలాలో ఉన్నట్లుగా గుర్తించామన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కనిపించకుండా
పోయిన అబ్బాయి వివరాలను అగర్తలా రైల్వే పోలీసులకు పంపి, వారితో మాట్లాడి, వారి సహకారంతో విజయనగరం తీసుకొని వచ్చామన్నారు.
తప్పిపోయిన బాలుడ్ని వారి
సంరక్షణలో తీసుకున్నారన్నారు. అనంతరం, విజయనగరం రూరల్ ఎస్ఐ వి.అశోక్ కుమార్ మరియు
సిబ్బంది అగర్తలా వెళ్ళి, అబ్బాయిని విజయనగరం తీసుకొని వచ్చామన్నారు. ఉత్కర్ష్ బనాకను వారి తల్లిదండ్రులు మోహన్ బనాక, స్మితలకు జిల్లా పోలీసు కార్యాలయంలో
అప్పగించడంతో, కథ సుఖాంతం అయ్యిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.
ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన విజయనగరం రూరల్ ఎస్ఐ వి.అశోక్ కుమార్ మరియు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.