జనం న్యూస్ 15 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
వేపాడ మండలం బానాదిలో శనివారం రాత్రి 5 దేవాలయాల్లోని హుండీలో సొమ్మును దొంగలు అపహరించినట్లు ఎస్.ఐ సుదర్శన్ తెలిపారు. శివాలయం, వినాయకుడు, హనుమాన్, పరదేశమ్మ, మరిడిమాంబ ఆలయాల్లో హుండీలను పగలగొట్టి సొమ్ము దొంగలించినట్లు వెల్లడించారు. దొంగలించిన సోమ్ము సుమారు రూ.41 వేలు ఉంటుందన్నారు. క్లూస్ టీమ్తో తనిఖీలు నిర్వహించారు. అర్చకుడు కిషోర్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ పేర్కొన్నారు.


