Listen to this article

జనం న్యూస్, 4 ఫిబ్రవరి, 2025, దిగ్వాల్ గ్రామం, కోహిర్ మండలం, సంగారెడ్డి జిల్లా.
( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు )
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలలో, 5 వ, తరగతిలో ప్రవేశం పొందడానికి, ఆన్లైన్లో అప్లికేషన్ ప్రక్రియ ఈనెల 1వ తేదీ నుండి, 6వ తేదీ వరకు, పొడిగించడం జరిగిందని, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని, ప్రస్తుతం దిగ్వాల్ గ్రామంలో కొనసాగుతున్న, టీ.జీ. ఎస్.డబ్ల్యూ. ఆర్. ఎస్./ జె సి. ( బాయ్స్ ) న్యాల్కల్ / దిగ్వాల్ కళాశాల, ప్రిన్సిపల్ ఎల్. రాములు తెలియజేశారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని గురుకుల పాఠశాల, మరియు కళాశాల ప్రిన్సిపల్ ఎల్, రాములు తెలిపారు.