Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గంధి నానాజీ

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఐ.పోలవరం ఉప మండల పరిధిలో కేశనకుర్రు పాలెం క్షత్రియ పరిషత్ ప్రాంగణంలో పెన్మత్స గోపాలకృష్ణం రాజు అధ్యక్షతన జరిగిన హిందూ సమ్మేళనంలో శృంగవృక్షం పంచమ పీఠాధిపతి పూజ్య శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామిజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూ ఆధ్యాత్మికతే హిందూ సమాజానికి బలం, ఐక్యతకు మూలమని పిలుపునిచ్చారు.ప్రతి తల్లి తమ పిల్లలను ఛత్రపతి శివాజీ లాగా పెంచాలని అన్నారు. ఐక్యంగా ఉంటూ,హిందూ ధర్మాన్ని ఆలయాలను కాపాడుకుందామని తెలిపారు. హిందువులంతా భగవద్గీత చదవాలని, హిందూ దేవాలయాలు, వాటి ఆస్తులను పరిరక్షించవలసిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు. ఆర్ఎస్ఎస్ ముమ్మిడివరం ఖండ సంఘచాలక్ పెన్మత్స గోపాల కృష్ణంరాజు మాట్లాడుతూసంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా హిందూ సమాజమే ఇలాంటి హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తుందని తెలిపారు.ఆధ్యాత్మికతే హిందూ సమాజానికి బలం, ఐక్యతకు మూలమని పిలుపునిచ్చారు.మరో ప్రధాన వక్త ఆర్ఎస్ ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యులు పాకాల త్రినాధ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకూడదని, నీటిని వృధా చేయరాదని,సమాజ పరివర్తన కోసం ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించిన “పంచ పరివర్తన” సామాజిక సమరసత, కుటుంబ ప్రభోధన్, పర్యావరణ పరిరక్షణ ,స్వదేశీ భావన, పౌర విధులు అనే ఐదు అంశాలను ప్రతి భారతీయుడు ఆచరణలో పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.వివిధ కుల సంఘాల పెద్దలకు, భజన మండళ్లకు స్వామీజీల చేతుల మీదుగా సన్మాన సత్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెన్మత్స కృష్ణంరాజు, పుసులూరి ప్రభాకర సుబ్బారావు,సాగిరాజు బాపిరాజు,కేశనకుర్రు సర్పంచ్ బీర సత్య కుమారి, పిన్నమరాజు వెంకటపతి రాజు, గాదిరాజు వెంకట సత్యనారాయణ రాజు, సొసైటీ అధ్యక్షులు గాదిరాజు విశ్వనాథరాజు, ముదునూరి శ్రీనివాసరాజు , రాయపురెడ్డి రామబ్రహ్మానందరావు,ఎస్ఎస్ ఎఫ్ ముమ్మిడివరం ఖండ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు, ఏలూరి రాంబాబు,సలాది శ్రీనివాసరావు, బొక్కా లక్ష్మీనారాయణ,గొలకోటి వెంకటరెడ్డి,మామిడాల వీర వెంకట సత్యనారాయణ మూర్తి , బొంతలు వంశీ,యాళ్ళ వెంకట సుబ్బారావు,వాండ్రాశి రామారావు, తోటకూర కృష్ణంరాజు, పేరాబత్తుల రామకృష్ణ, నంద్యాల నరసింహస్వామి,పడమట పద్మ , తదితరులు పాల్గొన్నారు.