

జనం న్యూస్ ఫిబ్రవరి 4 కూకట్పల్లి శ్రీనివాస్ రెడ్డి
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫతేనగర్ డివిజన్లోని కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ మరియు అధికారులుతో కలసి డివిజన్ లోని స్మశాన వాటికలను పరిశీలించారు. గౌతమ్ నగర్ ముస్లిం శ్మశాన వాటిక దగ్గర సి సి రోడ్ ఏర్పాటు, హిందూ శ్మశాన వాటిక దగ్గర మిగిలిన పనులు, ఎస్. సి శ్మశాన వాటిక లో బోర్, కాంపౌండ్ వాల్, మొక్కలు ఏర్పాటు, పార్థి బస్తి శ్మశాన వాటిక లో బర్నింగ్ ఫ్లాట్ ఫామ్, బోర్, రోడ్డు ఏర్పాటు అలాగే శ్మశాన వాటిక ల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టి బోర్వెల్ ఏర్పాటు చేయాలని స్థానికులు సూచించారు..యం.ఎల్.ఎ మాట్లాడుతూ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని , మౌలిక సదుపాయాలుకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో స్మశాన వాటికలు, అభివృద్ధి కొరకు పనులు ప్రారంభించామని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధిని కూడా ఆపేసి ఒక్క అడుగు కూడా ముందుకు పడకుండా చేస్తున్నారని అయినా కూడా ప్రజలకు మౌలిక సదుపాయాలకి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని.. ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు . ఈ కార్యక్రమములో బిక్షపతి, అంబటి శ్రీను, రాములన్న, సుదర్శన్ రెడ్డి, కన్నయ్య, కంచి మహేందర్, కంచి స్వామి, దత్త రావు , శశి, సలావుద్దీన్, గౌస్, రాము, కీర్తి , రాజ్ కుమార్, సతీష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు