జనం న్యూస్, డిసెంబర్ 15, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం :
మండలం లోని వేమూలకుర్తి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో, గనవిజయం సాధించిన సర్పంచ్ తరి రామానుజం ని, ఉప సర్పంచ్ బర్మ మల్లయని, వేములకుర్తి స్వర్ణకార సంఘం ఘనంగా సన్మానించింది, సర్పంచ్ ఉప సర్పంచ్ లతోపాటు, కాంగ్రెస్ పార్టీ మండల సేవాదళ్ అధ్యక్షుడు నాంపల్లి వెంకటాద్రిని, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెంట లింబాద్రిని స్వర్ణకార సంఘ అధ్యక్షులు బెజ్జారపు శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా సర్పంచ్ గా గెలిచిన అభ్యర్థి తరి రామానుజ మాట్లాడుతూ, ఎల్లవేళలా గ్రామంలో అందుబాటులో ఉంటూ గ్రామానికి కావలసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తానని అన్నారు, గ్రామంలోని సమస్యలన్నీ లిస్టు తయారు చేసుకోవడం జరిగిందని, పదవి చేపట్టిన వెంటనే ఒక్కొక్కటిగా పరిష్కరిస్తారని చెప్పారు, తన గెలుపు కృషి చేసిన తోటి కాంగ్రెస్ నాయకులకు, తనను నమ్మి ఓటేసి గెలిపించిన ప్రతి సభ్యునికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, కోటగిరి శ్రీనివాస్, స్వామి, అశోక్, కె. స్వామి, బెజ్జారపు శ్రీకాంత్, కనపర్తి నరేష్,సురేష్, నాంపల్లి గణేష్, నూనె సంతోష్, తదితరులు పాల్గొన్నారు


