జనం న్యూస్ 15 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ఓటేశాక వారితో ఇక అవసరం తీరిందనుకున్నారో ఏమో పట్టించుకున్న పాపాన పోలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రాళ్లచెలక, పెద్దకలస, మల్లారం గుంపు, ఎస్టీకాలనీ, కోయగట్టు, సీతారాంపురం, ఎర్రబోరు, ఒంటి గుడిసె తదితర గ్రామాలకు చెందిన గొత్తికోయలు ఆదివారం పాల్వంచ మండలం చంద్రాలగూడెం పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. కొందరు అభ్యర్థులు వీరు పోలింగ్ కేంద్రానికి రావడానికి ఆటోలు ఏర్పాటు చేశారు. తీరా ఓట్లు వేసిన అనంతరం పట్టించుకోకపోవడంతో గొత్తికోయలు కొద్దిసేపు రోడ్డు పక్కనే వేచిచూశారు. ఆ తర్వాత చేసేదేమీ లేక ఉసూరుమంటూ కాలినడకన ఇంటిదారి పట్టారు…


