జనం న్యూస్ డిసెంబర్ 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలం టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమకారుల పోరు హన్మకొండ కొండ జిల్లా అధ్యక్షులు శాయంపేట గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు పొడిశెట్టి గణేష్ ను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ అందరం కలిసి సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసే గ్రామపంచాయతీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మనోహర్ రెడ్డి మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి మాజీ ఉపసర్పంచ్ దైనంపెల్లి సుమన్ మండల నాయకులు ముంజలా నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు….


