Listen to this article

ప్రజల క్షేమమే నా ద్యేయంఅంటున్న కాపార్తి దీప ఆంజనేయులు,

ప్రజల అండదండలతో ముందుకెల్లుతా

జనం న్యూస్,డిసెంబర్ 15,కంగ్టి,

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో సర్పంచ్ బరిలో నిలిచిన కాపార్తి దీప ఆంజనేయులు, సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల క్షేమమే నా ధ్యేయమంటూ ప్రజల కొరకు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు కష్టపడి చేపడతానని ప్రజల కోరిక మేరకు ప్రజల అండదండలతో నిలిచి ప్రజల్లో నేనొక్కడిగా కలిసికట్టుగా,ప్రజలకు సర్వ సహాయ, అభివృద్ధి పనులకై కష్టపడతానని అన్నారు. నా గుణగణ లక్షణం, ఎలాంటిదో గ్రహించి,నా గ్రామ ప్రజలే నాకు బలం బలగంగా వెన్ను దండగ నిలిచి నన్ను,అధిక మెజార్టీతో గెలిపిస్తారన్నా నమ్మకంతో సర్పంచ్ పోటీలు నిలిచానని అన్నారు.నేను నమ్మిన నా ప్రజలు ఎప్పుడు నాకు తోడుగా ఉంటారని అన్నారు.నా గ్రామ ప్రజలు నన్ను ఎప్పుడు చిన్న చూపు చూడరు.ప్రజలను ఎన్నడూ నేను మరువను అని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు,అభిమానులు, నాయకులు,పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.