Listen to this article

తృతీయ వార్షికోత్సవంలో ప్రత్యేక పూజలు

జనం న్యూస్ డిసెంబర్ 15 సంగారెడ్డి జిల్లా

జిన్నారం ఎల్లమ్మ తల్లి మా నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ప్రార్థించారు. జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని జంగంపేట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో తృతీయ వార్షికోత్సవ వేడుకలను ఆలయ నిర్వాహకులు, గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అమ్మవారి చల్లని దీవెనలతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.