Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ఆదివారం సాయంత్రం రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో ” భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి వారి ” ఆధ్వర్యంలో సత్య సాయి బాబా శతజయంతోత్సవాల్లో భాగంగా ఊబలంక సత్యసాయి మందిరము నందు ఆలమూరు వాస్తవ్యులు శైవాగమపండితులు ఉపన్యాస వాచస్పతి ప్రతిష్టాచార్య టి టి డి వార్షిక సత్కార పండితులు బ్రహ్మశ్రీ కాళ్లకూరి సూరిపండు వారి ఆచార్యత్వంలో మరియు వాడపల్లి దేవస్థానం శివాలయం అర్చకులలో ఒకరైన బ్రహ్మశ్రీ దొంతుకుర్తి కుమార్ గారి బ్రహ్మత్వం లో మరియు వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానం అర్చకులలో ఒకరైన శ్రీమాన్ సాయి కృష్ణ గారి సహచర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శివ పార్వతి కళ్యాణం కళ్యాణానంతరం ఆచార్యులైన బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూరి పండు వారికి సత్యసాయి సేవా సమితి వారు చిరు సత్కారం చేసి వేద ఆశీర్వచనం పొందిరి ఈ సందర్భంలో సూరి పండు గారు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి చేసేటటువంటి వారి ఆశీస్సులతో సత్యసాయి సేవా సమితి వారు చేసేటటువంటి సేవలని కీర్తించి కొనియాడిరి… మన సంస్కృతిని మన ధర్మాన్ని మనం కాపాడే ప్రయత్నం చేస్తూ మన భావితరాల వారికి తెలియజేయాల్సిన ధర్మం మన వంతు మనం చేయాలి అని ఆగమపండితులు సూరి పండు గారు తెలియజేశారు…