జనం న్యూస్ డిసెంబర్ 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ఈరోజు అనకాపల్లి తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి గనులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ను కలిసి ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లో సెక్యూరిటీ గార్డ్ గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగ సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఆ కమిటీ అధ్యక్షులు పెతకంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. వారి సమస్యలు మంత్రికి వివరించడంతో ఆయన స్పందించి దీనిపై కమిటీ విచారణ జరిపించి న్యాయం చేస్తామని త్వరలోనే మంచి వార్త అందుకుంటారని చెప్పడం జరిగిందని శ్రీనివాసరావు అన్నారు.ఈ కార్యక్రమంలో జగదీష్, పొలిమేర పవన్ కుమార్, మరియు మార్కెట్ కమిటీ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.//


