డోంగ్లి డిసెంబర్ 15 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం మొగ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సూర్యకాంత్ పటేల్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సర్పంచ్ గా మరో సారి నన్ను గెలిపిస్తే పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. గ్రామంలో ఉన్న సమస్యలు తనకు తెలుసు అని సర్పంచుగా మరోసారి గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తానని, గ్రామంలో ఉన్న విద్య, వైద్యం మెరుగుపరుస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.యువకులు, నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేసి సూర్యకాంత్ పటేల్ ను 100% గెలిపించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.




