డోంగ్లి డిసెంబర్ 15 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం మొగా గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి హలే బస్వంత్ ప్రచారం చేస్తూ ఒక్కసారి సర్పంచ్ గా అవకాశం ఇస్తే మొగా గ్రామం అభివృద్ధి పథంలో నడిపిస్తానని గ్రామంలో ఉన్న త్రాగునీటి , డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కరించి ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తానని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో గ్రామంలో ఉన్న సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తూ 17వ తేదీ ఓటింగ్ రోజు ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. వీరితోపాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, కార్యకర్తలు ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొని సర్పంచిగా గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.




