Listen to this article

నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటా..

తడ్కల్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎలిశాల సుగుణ మల్లారెడ్డి …

జనం న్యూస్,డిసెంబర్ 15,కంగ్టి,

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎలిశల సుగుణ మల్లారెడ్డి, సోమవారం పార్టీ కార్యకర్తలతో ర్యాలీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి మాట్లాడుతూ తడ్కల్ ప్రజలందరికి నిత్యం అందుబాటులో ఉండి సేవలను అంగిస్తారని అన్నారు. సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ తనను సర్పంచ్ గా పని చేసేందుకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాను అని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎలిశాల సుగుణ మల్లారెడ్డి తెలిపారు.ఆమె ఇంటింటి ప్రచారం,ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు.తన గుర్తును చూయిస్తూ ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు.అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు.మౌలిక వసతుల విస్తరణ, తాగునీటి సమస్య పరిష్కారం,రహదారుల విస్తరణ వంటి అంశాలను పరిష్కరిస్తానన్నారు. ప్రతి కుటుంబాన్ని చేరుకుని వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపడమే నా లక్ష్యం అన్నారు.మెరుగైన మౌలిక వసతులు, మహిళల సాధికారత, యువత అభివృద్ధి వైపు పనిచేస్తా అని వెల్లడించారు.ప్రస్తుత ప్రభుత్వం యువతకు ప్రాధాన్యం ఇవ్వడం, మహిళా నాయకులకు అవకాశాలు కల్పించడం సంతోషకరమని చెబుతూ,ఎన్నికల్లో మంచి వాతావరణం నెలకొన్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.