జనం న్యూస్ డిసెంబర్ 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయంలో అమర జీవి పుట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఘనమైన నివాళులర్పించారు. పార్టీ నాయకులను ఉద్దేశించి రవీంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం త్యాగశీలి , అమరజీవి పొట్టి శ్రీరాములు 1952 డిసెంబర్ 15వ తేదీన , 56 రోజులు నిరాహార దీక్ష పాటించి చనిపోయారని, ఆయన మరణాంతరం చెలరేగిన హింసాత్మిక ఆందోళన కారణంగా అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటును ప్రకటించారని రవీంద్ర అన్నారు. ఆయన త్యాగానికి గుర్తింపుగా అమరజీవి పొట్టి శ్రీరాములు బిరుదుని ప్రకటించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ మల్ల సురేంద్ర కోట్ని బాలాజీ కోట్ని రామకృష్ణ బోడి వెంకటరావు కుప్పిలి జగన్ పొలిమేర నాయుడు సిదిరెడ్డి శ్రీనివాసరావు బొడ్డేడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.//


