ఎస్సై మోహన్ రెడ్డి
బిచ్కుంద డిసెంబర్ 15 జనం న్యూస్
బిచ్కుంద మండల ప్రజలందరికీ పోలీసువారి ముఖ్య సూచనలు ఏమనగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులందరూ మరియు ప్రజలందరూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసు వారికి సహకరించగలరని కోరుతున్నాము. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎవరు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించరాదని ఉల్లంఘించు వారిపైన కఠిన చర్యలు తీసుకోబడును .అవాంఛనీయ సంఘటనలు గొడవలు ఏమి జరగకుండా ప్రజలందరూ సామరస్యపూర్వకంగా స్నేహ భావంతో ఎన్నికలలో పాల్గొని ఓటు హక్కును అందరూ వినియోగించుకొని తనకు నచ్చిన అభ్యర్థులకి ఓటు వేసుకోవాలని కోరుతున్నాము. ఓటు వేసే ఓటర్లు పోలింగ్ బూత్ లోకి లోపలికి మొబైల్ ఫోన్స్ ,కెమెరాస్ ,బ్యాగ్స్ ,మ్యాచ్ బాక్స్ ,ఇంక్ పెన్సిల్ లాంటివి తీసుకెళ్లకూడదు
100 మీటర్ల లైన్ దాటుకుని ఎవరు కూడా బైకుల పైన కానీ ఇతర వాహనాల పైన కానీ రాకూడదు ఓటు వేసే అభ్యర్థులు మాత్రమే 100 మీటర్ల లైను దాటుకుని ప్రశాంతమైన వాతావరణం లో ఓటు వేసుకొని వెళ్లగలరు
ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ పోలీసువారి సూచనలు తప్పకుండా పాటించగలరని కోరుతున్నాము గెలిచిన అభ్యర్థులు ఎలక్షన్ కోడ్ ను విధిగా పాటిస్తూ విజయోత్సవ ర్యాలీలు ఎవరు తీయరాదు తీసినచో చట్టపరమైన చర్యలు తీసుకోబడును అని ఎస్ఐ మోహన్ రెడ్డి తెలిపారు


