Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ జనం న్యూస్ డిసెంబర్ 15

జహీరాబాద్ నియోజకవర్గం, మొగుడంపల్లి మండల్ చిన్నబట్టి తండా గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతావత్ గోవింద్ నాయక్ ఘన విజయం సాధించారు. గ్రామ ప్రజల సంపూర్ణ మద్దతుతో గోవింద్ నాయక్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రచారంలో గ్రామాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, తాగునీరు, రహదారులు, విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చిన గోవింద్ నాయక్‌పై ప్రజలు విశ్వాసం ఉంచి విజయం కట్టబెట్టారు.గెలుపు అనంతరం గోవింద్ నాయక్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నబట్టి తండాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు ఆయనను ఘనంగా అభినందించారు. గ్రామంలో విజయోత్సవాలు జరగగా, పటాసులు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.