జనం న్యూస్ డిసెంబర్(16) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం ముకుందపురం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ నేత తుంగతుర్తి మాజీ జెడ్పిటిసి మురగుండ్ల లక్ష్మయ్య అనారోగ్యంతో అకాల మరణం చెందినాడు. లక్ష్మయ్య చిన్నతనములోనే ప్రజల వెంట ఉండి ప్రజల కోసం పోరాటం చేసి చిన్న నేమిలా,కొత్తపల్లి, ముకుందపురం గ్రామాలకు సొసైటీ చైర్మన్గా పనిచేసే అలాగే మామిళ్ల మడవ,కొత్తపల్లి గ్రామాలకు ఎంపిటిసిగా ముకుందపురం గ్రామ సర్పంచిగా తుంగతుర్తి జడ్పిటిసిగా ప్రజలకు నిత్యం వెంట ఉండి సేవలందించిన గొప్ప నాయకుడు. లక్ష్మయ్య మృతి చెందిన వార్త విని గ్రామ ప్రజలందరూ దుఃఖ శ్లోకంలో మునిగిపోయారు.


