.జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 16
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని నిరాహార దీక్ష చేపట్టి అమరుడైన పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు వారు ఎన్నటికీ మర్చిపోలేరని తర్లుపాడు మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జవ్వాజి విజయభాస్కరరావు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా స్థానిక పొట్టి శ్రీరాములు పార్కులో ఆయన విగ్రహానికి మండల ఆర్యవైశ్య సంఘం గ్రామ ప్రజలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ కస్సెట్టి వెంకట రవికుమార్ కోశాధికారి చిన్న మనకొండ సుబ్రహ్మణ్యం ఆర్యవైశ్య సంఘం నాయకులు దోగిపర్తి మల్లికార్జునరావు వాగి చెర్ల మురళీకృష్ణ, నేరెళ్ల జనార్దన్ రావు జవ్వాజి వెంకటేశ్వర్లు, జవ్వాజి జనార్దన్ కోలగట్ల భాస్కర్ రెడ్డి ఈర్ల వెంకటయ్య గోసు వెంకటేశ్వర్లుతదితరులు పాల్గొన్నారు.


