Listen to this article

జనం న్యూస్ 16డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.

జైనూర్: జైనూర్ మండలం రావుజీగూడ గ్రామ నూతన ఉప సర్పంచ్ పెందూరు గంగామణి, వార్డు సభ్యులు ఊర్వేత బాగుబాయి, మెస్రం చంద్రకళ, షేక్ సబీనాబీ, షేక్ కైరున్ బీ మంగళవారం మండల ఉపాధ్యక్షుడు పెందూర్ ప్రకాష్, మాజీ సర్పంచ్ జాదవ్ దత్త ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు.ఈ సందర్భంగా కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క వారందరికీ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారికి శాలువాలతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.సుగుణక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని, గ్రామ స్థాయి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల నమ్మకంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీని మరింత బలోపేతం చేయాలని, గ్రామ అభివృద్ధికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఊర్వేత జైవంత్ రావు, మెస్రం గణపత్ రావు, ఊర్వేత లింగు, పెందూర్ వసంత్ రావు, షేక్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు.డీసీసీ కార్యాలయం, కుమురంభీమ్ ఆసిఫాబాద్