Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

అనకాపల్లి జిల్లా. ఎలమంచిలి నియోజకవర్గం మండలంలోని జనసేన పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు రెవెన్యూ డివిజన్‌ను యధావిధిగా కొనసాగించాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా ముఖంగా నిరసనను తెలియజేశారు. మునగపాక మండల జనసేన పార్టీ ఇంచార్జ్ పరశురాం మాట్లాడుతూ ఈ డివిజన్ జిల్లా పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తోందని, దీనిని రద్దు చేస్తే స్థానికులకు చాలా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. ఈ డిమాండ్‌కు స్థానిక నాయకులు మద్దతు తెలపుతూ, ప్రభుత్వం త్వరగా సానుకూల చర్య తీసుకోవాలని కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఇంచార్జి మినిస్టర్ కొల్లు రవీంద్ర కు మునగపాక, అచ్చుతాపురం, రాంబిల్లి మండలాలు అనకాపల్లి డివిజన్లో ఉండేలా నియోజకవర్గం కూటమి నాయకులు వినతిపత్రం అందజేశారు. దానికి మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే పంచదార్ల లో వందల సంవత్సరముల నాటి పుణ్యక్షేత్రం కాపాడాలని పుణ్యక్షేత్రం గల కొండ గ్రావెల్ మైనింగ్‌కు గురవుతుందని ఎమ్మెల్యే విరోధం రాంబిల్లి మండలంలో పంచదార్ల గ్రామంలో వందల సంవత్సరల నాటి పుణ్యక్షేత్రం ఉన్న కొండపై గ్రావెల్ తవ్వకుండా చూడాలని స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆక్షేపించారు. మైన్స్ అధికారులు ఆ కొండకు గ్రావెల్ తవ్వేందుకు లీజ్ మంజూరు చేశారని తెలిపిన ఎమ్మెల్యే, తక్షణమే ఆ లీజ్‌ను రద్దు చేయాలని, పవిత్ర క్షేత్రం సమగ్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్థానికులు సంతకాల పిటిషన్‌లు సమర్పించారు.
అలాగే ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల కుటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.//