Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 4 మెదక్ జిల్లా చిలిపి చెడు మండల ప్రతినిధిచిలిపిచేడ్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు నాగేష్ ఆధ్వర్యంలో ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది కేంద్ర బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు బిజెపి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపడం జరిగిందిప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను తప్పుపడుతూ నిన్న కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టడం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రాలను ఆయా రాష్ట్రాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ కేబుల్ చేసిందని తెలంగాణకు ఏమిచ్చిందని ప్రశ్నిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆయుష్మాన్ భారత్ కింద కోట్ల నిధులను ఇస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం వెచ్చించే కోట్ల రూపాయల నిధులను ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వాడు కూడా అని ప్రశ్నించారు. ఇవే కాకుండా నిరుపేదలైన ప్రతి వ్యక్తికి ఉచిత రేషన్ బియ్యం మహిళలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ వైకుంఠధామాలు పల్లె ప్రకృతి వనాలు డంపింగ్ యార్డులు తోపాటు గ్రామాలలో పారిశుద్ధ్యనికి మంచినీటికి గ్రామపంచాయతీలకు కోట్ల రూపాయల నిధులు కేంద్ర బడ్జెట్ లోనివి కావాఅని ప్రశ్నించారు.ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాంగ్రెస్ నాయకులకు తగదు అన్నారు. తెలంగాణ మహిళలకు నెలనెలకు ఇస్తానన్న 2500 మాటేక్కడ పోయిందన్నారు. భూమిలేని రైతులకు ఉపాధి హామీ లింకు లేకుండా 12000 ఇయ్యడం చేతగాక కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో చిలిపి చెడు మండల బిజెపి అధ్యక్షుడు నగేష్ మెదక్ జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ మరియు మాజీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి భూత్ అధ్యక్షులు రాజగౌడ్ శేఖర్ మైపాల్ యాదగిరి రాజు రవి తదితరులు పాల్గొన్నారు