

జనం న్యూస్ ఫిబ్రవరి 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రథసప్తమి సందర్భంగా అనకాపల్లి మండలం రాజుపాలెం గ్రామంలో ఉన్న సూర్యనారాయణ మూర్తి దేవస్థానాన్ని సందర్శించిన మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ మరియు అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రాంకీ లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనకాపల్లి సుంకరమెట్టు జంక్షన్ వద్ద ఉన్న ఉష ఛాయా పద్మనీ సమేత సూర్యనారాయణ మూర్తి దేవస్థానంని సందర్శించారు. ఈ సందర్భంగా ఇరు దేవస్థాన కమిటీ వారు కొణతాల రామకృష్ణ ని మరియు భీమర శెట్టి రాంకీ ని సత్కరించి షీల్డ్ ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.