జనం న్యూస్ డిసెంబర్ 17 సంగారెడ్డి జిల్లా;
వచ్చే ఎన్నికల్లో బీజేపీ దే అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందగా.. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఎమ్మెల్సీ స్వగృహం లో కలిశారు. ఈ మేరకు గెలిచిన సర్పంచులను బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి తో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్టంలో ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశారని, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామస్థాయిలో ఖర్చు చేయకుండా, కేంద్ర నిధులను దారి మళ్లించడం వల్ల గ్రామాల అభివృద్ధి నిలిచిపోయిందని గుర్తు చేశారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. పంచాయతీ వ్యవస్థను గత రెండేళ్లుగా పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ అత్యదిక స్థానాలు గెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, నాయకులు గొల్ల భాస్కర్, సుభాష్ తదితరులు ఉన్నారు.


