Listen to this article

ప్రజల సేవలో 24/7 ఉంటానని అన్నాడు

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 17

ప్రజానాయకుడు జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ సజ్జాపూర్ గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రసాద్ రెడ్డి సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతానని హామీ ఇచ్చిన ప్రసాద్ రెడ్డికి గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు. గత కొంతకాలంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను గమనించి, వాటికి శాశ్వత పరిష్కారాలు చూపుతానన్న నమ్మకంతో ప్రజలు ఆయనకు భారీ మెజారిటీతో పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో సాధించిన విజయం వ్యక్తిగత విజయం కాదని, సజ్జాపూర్ గ్రామ ప్రజల సమిష్టి విజయమని ప్రసాద్ రెడ్డి తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీ, పేదల గృహాలు, రైతుల సమస్యలు, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రసాద్ రెడ్డి అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు, యువకులు మాట్లాడుతూ ప్రసాద్ రెడ్డి ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడని, కష్టసుఖాల్లో గ్రామ ప్రజలతో కలిసి నిలిచే వ్యక్తి కావడంతోనే ఈ ఘన విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా కృషి చేస్తానని ప్రసాద్ రెడ్డి తెలిపారు. సజ్జాపూర్ గ్రామం అభివృద్ధి బాటలో మరింత వేగంగా ముందుకు సాగుతుందన్న నమ్మకాన్ని ఈ ఘన విజయం మరోసారి చాటిచెప్పింది.