

జనంన్యూస్. 04.
నిజామాబాదు. ప్రతినిధి. శ్రీనివాస్.సిరికొండ.ఆశాలకు రేప్రెసి, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలి.సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్.స్ఫుటం డబ్బులను ఆషాలే తేవాలని .అధికారుల వేధింపులు వెంటనే మానుకోవాలి..సిరికొండలో ఆశా వర్కర్ల సమస్యల పైన మెడికల్ అధికారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నూర్జహాన్.మాట్లాడుతూ ఫిబ్రవరి నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని లెప్రసి సర్వే చేయాలని ఆశాలకు జిల్లా అధికారులు చెప్తున్నారు. వెంటనే లెప్రసీ సర్వే . ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని లెప్రసి, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలని కోరుతున్నాము.రాష్ట్రంలో 2023లో సగం జిల్లాలకు, 2024లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఆశాలు చేసిన లెప్రసి డబ్బులు, 2024లో చేసిన పల్స్పోలియో డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ఆశాలకు చెల్లించలేదు. ఈ అంశం పైన కమీషనర్ ఆఫీస్లో సంబంధిత అధికారులను మా యూనియన్ ఆధ్వర్యంలో కలిసినప్పుడు లెప్రసి 2 సంవత్సరాల సర్వే డబ్బులు మేము రిలీజ్ చేసి చాలా కాలమైందని, సర్వేకు ముందే ఈ బడ్జెట్ మేము రిలీజ్ చేస్తున్నామని తెలియజేస్తూ మాకు బడ్జెట్ వివరాలతో కూడిన సంబంధిత ప్రొసీడింగ్ ఆర్డర్స్ అందజేశారు. ఈ ఆర్డర్ కాపీలు తీసుకొని అన్ని జిల్లాల్లో మా నాయకత్వం జిల్లా డీఎంహెచ్వో అధికారులను కలిసి పెండింగ్ లెప్రసి సర్వే డబ్బులు చెల్లించాలని కోరారు. దీని పైన జిల్లా అధికారులు స్పందిస్తూ మాకు పై నుండి డబ్బులు రాలేదని, ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చినంత మాత్రాన డబ్బులు ఇచ్చినట్టు కాదని అంటున్నారు. ఈ అంశాన్ని రాష్ట్రస్థాయిలో సంబంధిత అధికారులకు తెలియజేశాము, రాష్ట్ర అధికారులు స్పందిస్తూ జిల్లా అధికారులు చెబుతున్నది. కరెక్ట్ కాదని, మేము పంపించింది వాస్తవమని అంటున్నారు. ఈ రెండింటి మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలు గందరగోళానికి గురవుతున్నారు. పైగా రెండు సంవత్సరాల నుండి చేసిన లెప్రసి సర్వే మరియు 2024లో చేసిన పల్స్ పోలియో డబ్బులు రాక ఆశాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. సంవత్సరాల తరబడి చేసిన పనికి డబ్బులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూ, ఇప్పుడు మళ్లీ కొత్తగా లెప్రసి సర్వే చేయాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు న్యాయమని ఆశా వర్కర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు.కావున పై అంశాలు పరిశీలించి, వెంటనే పరిష్కారం కోసం కృషి చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించి ఆశాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాము.ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ నాయకులు రాధా. సువర్ణ.లక్ష్మి.గంగామణి. విజయ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం మోహన్.కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు మల్యాల సుమన్.వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నాగుల గోవర్ధన్. రేవతి.గంగామణి. త్రివేణి.పద్మ తదితరులు పాల్గొన్నారు.