Listen to this article

జనం కోసం 17 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

ఎలికట్టలో “బిఆర్ఎస్ పార్టీకి షాక్” బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలోకి గోనెల రాము కాంగ్రెస్ గూటికి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గుల్లే కృష్ణయ్య బిఆర్ఎస్ పార్టీకి ఎలికట్ట కాంగ్రెస్ నేతల సరైన జవాబు మళ్ళీ సొంతగూటికి పిట్టల బోనయ్య ఎలికట్ట మాజీ ఎంపీటీసీ కావలి శ్రీశైలం రాజకీయ ఎత్తుగడపై ఎమ్మెల్యే ప్రశంసలు కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్య పడుతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం ఫరూక్ నగర్ మండలం ఎలికట గ్రామానికి చెందిన ముఖ్య బిఆర్ఎస్ నాయకులు గ్రామ మాజీ ఎంపీటీసీ కావలి శ్రీశైలం తదితరులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏలికట్ట కాంగ్రెస్ నాయకులు బుద్దా నర్సింహ, గున్న శర్వలింగం, రాజు హాజరు కాగా వార్డ్ మెంబర్స్ పిట్టెల కమలమ్మ బోనయ్య, గోనెల రాము, గుల్లే ప్రమీల, భవాని మాత టెంపుల్ మాజీ చైర్మన్ గుల్లే కృష్ణయ్య తదితరులు కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది. సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఎవరెన్ని వేషాలు వేసిన జిమ్మిక్కులు చేసిన గజకన్న గోకర్ణ టక్కు టమాటా విద్యలు ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదని ప్రతిపక్షాలు చేసే కుట్రలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ఎత్తుగడలు వేస్తూనే ఉంటుందని అన్నారు. పార్టీలో చేరిన టిఆర్ఎస్, బిజెపి నాయకులకు ఆయన స్వాగతం పలుకుతూ వారికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. రాజకీయ ఎత్తుగడపై ఎమ్మెల్యే ప్రశంసలు.ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీకి వెళ్లిన కొంతమంది రాజకీయంతో కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుపోయత్తు వేసి కాపాటి చెందిన నాయకులను కాంగ్రెస్ పార్టీలో కలుపుకుని మరోసారి రాజకీయ అధిపత్యాన్ని చాటుకోవడంతో ఎమ్మెల్యే శంకర్ స్థానిక కాంగ్రెస్ నాయకులపై ప్రశంసలు కురిపించారు. రాజకీయ స్వార్థం కోసం వెళ్ళిపోయేవారిని పట్టించుకోవద్దని ఎవరైతే మనతో కలిసి వస్తారో వారికి నిజాయితీగా పార్టీ అందరం ఎక్కిస్తుందని అన్నారు. భవాని మాత ఆలయ మాజీ కమిటీ చైర్మన్ గుల్ల కృష్ణయ్య అదే విధంగా పిట్టల కమలమ్మ బోనయ్య సొంత గొట్టికు చేరుకోవడం బిజెపి నుండి గోనెల రాము పార్టీలోకి రావడం హర్షించదగ్గ పరిణామం అని మాజీ ఎంపిటిసి శ్రీశైలంను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ సీనియర్ నేత శివశంకర్ గౌడ్, అంచే రాములు తదితరులు పాల్గొన్నారు….