జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 17
తర్లుపాడు మండలం తర్లుపాడు గ్రామం లో వెంచేసియున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం లో రెండవ రోజు ధనుర్మాస వ్రతము విశేష పూజ కార్యక్రమం వైభవం గా జరిగినవి. దేవస్థానం వంశ పారంపర్య ధర్మ కర్త జవ్వాజి విజయభాస్కర రావు ఆధ్వర్యంలో, శ్రీమాన్ కారంపూడి వెంకట రమణచార్యులు చే పూజలు జరిగినవి. స్వామి వారి ధనుర్మాసము నెల రోజులుకీ పూలమాలలు, మరియు వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు అల్పాహారం నకు ద్రవ్యము తర్లుపాడు గ్రామ వాస్తవ్యులు ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసము ఉండు కుటుంబము కీ. శే.గోపు వెంకటయ్య జ్ఞాపకం గా వీరి ధర్మపాత్ని శ్రీమతి శ్రీదేవి వీరి కుమారులు 1.వెంకటేష్ ధర్మపత్ని సౌజన్య మరియు గంగాధర్ రు. 9000/- సమర్పించారు.ఈ కార్యక్రమం లో శేషుకుమారి జవ్వాజి సంధ్యారాణి. సావిత్రి భావన, చినమన గొండ అనంత లక్ష్మీ, బాసు సుజాత కోప్పుల కృష్ణ వేణి,కోలగట్ల లింగమ్మ, లక్ష్మీనారాయణమ్మ, గోసు వెంకటేశ్వర్లు, తాడువాయి కాశీరత్నము, అంజయ్య యాదవ్ ఇంక అనేక మంది భక్తులు పాల్గొన్నారు. సత్యసాయి భజనమండలి కన్వినర్ భవనము రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తర్లుపాడు గ్రామ రధము మాడ వీధుల్లో నగర సంకీర్తన చాలా వైభవం గా జరిగింది. జై శ్రీమన్నారాయణ.



