సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 17
జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్ మండల్‌లో అనురాగ్ థియేటర్ పక్కన న్యూ అపోలో మెడికల్ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందుతోంది. న్యూ అపోలో మెడికల్‌లో అన్ని రకాల మందులు సరైన రేట్లకే అందుబాటులో ఉండటం వల్ల స్థానిక ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు. నాణ్యమైన మందులు, అవసరమైన ఔషధాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతూ రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందిస్తున్నారు.మెడికల్ షాప్ యజమాని నరేష్ వినియోగదారులతో సౌమ్యంగా మాట్లాడుతూ, అవసరమైన సమాచారం అందిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం తగ్గించే విధంగా మందులను సరైన ధరలకు ఇవ్వడం ప్రశంసనీయమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. జహీరాబాద్ పట్టణంలో విశ్వసనీయ మెడికల్ షాప్‌గా న్యూ అపోలో మెడికల్ పేరు నిలబెట్టుకుంటూ, ప్రజారోగ్యానికి తోడ్పడుతూ ఆదర్శంగా నిలుస్తోంది.


