Listen to this article

పల్లెల్లో పోటెత్తిన జనం,

జనం న్యూస్,డిసెంబర్ 17,కంగ్టి,

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని మండల నూటల అధికారి బాలరాజ్, ఎంపిడిఓ సతయ్య, తెలిపారు.సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని 33 గ్రామపంచాయతీ ఉండగా రెండు ఎకగ్రీమయ్యాయి . బుధవారం 31 సర్పంచ్ గ్రామపంచాయతీ 234 వార్డు సభ్యుల 236 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు.ఎన్నికలకు జరిగాయి.ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించారు. మండలంలో 85.30 శాతం పోలింగ్ నమోదైందన్నారు. మొత్తం ఓటర్లు 34992 ఓటర్లు గాను 29847 ఓట్లు నమోదయ్యాయి. పల్లె జనం ఓటేసేందుకు ఉదయం నుంచి బారులు తీరారు. వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో భారీగా పోలింగ్ నమోదయింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్లు లెక్కింపు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాస్కర్ ఎంఈవో రహీమొద్దీన్ తదితరులు ఉన్నారు.