సయ్యద్ అబ్దుల్ నజీర్ జనం న్యూస్ 17డిసెంబర్ ( కొత్తగూడెం నియోజకవర్గం )
భారత స్వాతంత్ర్య పోరాటానికి చైతన్య గీతం! స్వరాజ్య ఉద్యమానికి స్ఫూర్తి నిచ్చిన, ఉత్ప్రేరక మంత్రం!
శరీర రోమాలను నిక్కబొడిపించిన,శబ్దతరంగం! జాతి మత మేదైనా జనులను ఏక త్రాటి పై నిలిపిన గానం!
వాడ వాడలలో స్వరాజ్య ఉద్యమానికి ఊపిరి పోసిన గేయం! నరనరాల్లో రక్తాన్ని ఉరకలేత్తించిన,
భారత మాత ఆక్రోశ గీతం! ఉరిశిక్షలు పడ్డ వీరులు ఉరితాడును, ముద్దాడుతూ పలికిన విప్లవ శంఖారావం!
రవి అస్తమించని బ్రిటీష్ రాజ్యాన్ని, గడ గడ లాడించిన గేయం! ఉద్యమకారుల ఐక్యతను పెంపొందించిన
ప్రణవ నాదం! లాఠీలు విరిగిన గాయాలు రక్తాలు చిందించిన, అదరని బెదరని చెదరని దేశభక్తికి,
చిరస్మరణీయ గీతం! బంకిం చంద్ర చటర్జీ వందేమాతరం రచించి, మహమ్మద్ ఇక్బాల్ సారే జహసే అచ్ఛాఆలాపించి, దేశ జనులలో దేశభక్తిని పొంగించి,స్వరాజ్యం మా జన్మ హక్కు అని నినదించి,
తెల్ల దొరలను పారద్రోలుటకు ఉద్యమించి,భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుటకు,పాలు పంచుకొనే,ఈ దేశభక్తి గీతాలు!!రచన; సయ్యద్ అబ్దుల్ నజీర్,కొత్తగూడెం చరవాణి 8897811024


