జనం న్యూస్ డిసెంబర్ 17 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
ఆల్విన్ కాలనీ డివిజన్ తులసి వనం అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్న ఎల్లమ్మ చెరువులో మరియు హెచ్ ఎం టి శాతవాహన నగర్ మరియు ఇంద్రహిల్స్ సరిహద్దులోని భీమిని చెరువులో డ్రైనేజీ కాలషుత నీళ్లు చేరడంతో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు పూడికలు తీయకపోయడంతో ఏర్పడిన చెత్త వలన పందులు, దోమల, మరియు విషపురుగులతో చెరువు సరిహద్దుల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దీన్ని ఇప్పటికైనా హైడ్రా అధికారాలు గుర్తించి చెరువుని ప్రక్షాళన చేసి ఈ సమస్యల నుండి విముక్తి చేయాలనీ డిమాండ్ చేస్తూ ఈరోజు చాయ్ బిస్కెట్ కార్యక్రమంలో భాగంగా బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ నాయకులు, మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సేవ్ ఎల్లమ్మ చెరువు ప్లెకార్డ్స్ లతో నిరసనలు తెలిపారు…ఈ సందర్బంగా ఎర్రబెల్లి సతీష్ రావు మాట్లాడుతూ మురికినీటిని చెరువులో కలవకుండా డైవర్ట్ చేయడానికి గత ప్రభుత్వ మంత్రి కె టి ఆర్ ఏర్పాటు చేసిన యస్ టి పి పనులని కూడా నల్లేరుమీద నడకలగా చేస్తున్నారని మండిపడ్డారు…కావున ఇప్పటికైనా అధికారులు ఈ మురికి నీటి సమస్యలనుండి చెరువు చుట్టూ ఉన్న స్థానిక ప్రజలను కాపాడాలని కోరారు…
ఈ కార్యక్రమంలో రాములు గౌడ్, జనార్ధన్, నాగేశ్వరరావు, జగదీష్, వెంకటేష్, శ్రీధర్, రాజు, అరవింద్, రవి, శ్రీనివాస్, నర్సింహా, ఖాజా, రహీం, ఫజల్, రామకృష్ణ, మాధవరెడ్డి, ధనరాజ్, నాగరాజు, దయానంద్, స్వరూప రాణి, దేవి రెడ్డి, ప్రీతీ, మహమూదా, ధనలక్ష్మి, గణిత, జబీన్, మరియు టిమ్ ఈ ఎస్ ఆర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు


