

–కలెక్టర్కు వివరించిన ప్రజా సంఘాల నాయకులు
జనం న్యూస్ 0 4 ఫిబ్రవరి ( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురి మెళ్ళ శంకర్ )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని రక్షణ పర్యవేక్షణ లేక శిధిలావస్థకు చేరుకుంటుందని ప్రజాసంఘాల చేతిలో ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చెందిన అంబేద్కర్ భవన్ ప్రభుత్వం చేతిలోకి పోయిన తర్వాత ఎవరి పర్యవేక్షణ లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని అటుగా వెళ్లే ప్రజలకు మరియు హాస్టల్ విద్యార్థునులకు. ఇబ్బందిగా మారిందని రాత్రిపూట తాళం పగలగొట్టి మందు బాటిళ్లు కాల్చిన సిగరెట్లు అలాగే కండోమ్ ప్యాకెట్లు కూడా ఉండడం చాలా విచారకరం అని వాటికి సంబంధించిన ఫోటోలను కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కావున కలెక్టర్ గారు వెంటనే స్పందించి ప్రజాసంఘాల తో ఒక అభివృద్ధి కమిటీ జాయింట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా లావాదేవీలు జరిగేలా చూడాలని ప్రజలకు ఉపయోగపడేలా ఇంకా అభివృద్ధి పరచాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం
ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు తాండ్ర వెంకటేశ్వర్లు ఎమ్మార్పీఎస్ నాయకులు చదలవాడ సూరి మాదిగ జాక్ నాయకులు మోదుగు జోగారావు తదితరులు పాల్గొన్నారు