Listen to this article

నిర్వహించిన పటాన్‌చేరు యువనాయకులు జలగరి దేవకుమార్

జనం న్యూస్ డిసెంబర్ 17 సంగారెడ్డి జిల్లా

పటాన్ చేరు మహారాష్ట్ర రాష్ట్రం తుల్జాపూర్‌లో ప్రసిద్ధిగాంచిన శ్రీ తుల్జాభవానీ మఠంలో పటాన్‌చేరు యువ నాయకులు జలగరి దేవకుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ ప్రజల సుఖసంతోషాలు, శాంతి సమృద్ధులు కలగాలని అమ్మవారిని ప్రార్థించారు.ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ పూజల్లో జలగారి దేవకుమార్‌తో పాటు ఆయన మిత్రబృందం నాగసాని వెంకటేష్, శ్రీశైలం, గణేష్, భరత్, నాగేష్ పాల్గొన్నారు. తుల్జాభవానీ అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆరతులు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా యువనాయకులు మాట్లాడుతూ, తుల్జాభవానీ అమ్మవారి కృపతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు. భక్తుల రద్దీ మధ్య ప్రశాంతంగా సాగిన ఈ దర్శనం పటాన్‌చేరు యువనాయకులకు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు.