Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం చిన కొత్తలంక ఉప మండలంలో చిన కొత్తలంక బ్రహ్మేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో కొడమర్తి వెంకటరత్న శర్మ అధ్యక్షతన జరిగిన హిందూ సమ్మేళనంలో పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాదా చార్య స్వామిజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూపురాణాలు, ఇతిహాసాలు,సంప్రదాయాల ప్రభావంతో సనాతనధర్మం ప్రారంభమైందని, భారతదేశ సమైక్యతకు ప్రతి రూపం హిందూ సమ్మేళనం అన్నారు. ప్రతి మనిషి వారి విధానాలు సక్రమంగా అలవర్చుకోవాలన్నారు. అప్పుడే సంప్రదాయం ఉంటుందన్నారు. ముఖ్యఅతిథి శ్రీకంఠం ప్రభాకర రావు గారు మాట్లాడుతూ సనాతనం ధర్మం ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు‌. ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యకారిణి సభ్యులు శ్రీ నండూరి కృష్ణ గారు మాట్లాడుతూ సమాజ పరివర్తన కోసం ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించిన “పంచ పరివర్తన” అనగా సామాజిక సమరసత, కుటుంబ ప్రభోధన్, పర్యావరణ పరిరక్షణ ,స్వదేశీ భావన, పౌర విధులు అనే ఐదు అంశాలను ప్రతి భారతీయుడు ఆచరణలో పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్మెత్స గోపాలకృష్ణంరాజు ,శ్రీకంఠం ప్రభాకర రావు ,పొత్తూరి మూర్తిరాజు ,కొడమర్తి వెంకటరత్న శర్మ , గొలకోటి వెంకటరెడ్డి,కుచ్చర్లపాటి వీరభద్ర రాజు ,ఎస్ఎస్ఎఫ్ ముమ్మిడివరం ఖండ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు,పితాని రామచంద్రరావు ,నంద్యాల నరసింహస్వామి, ఏలూరి రాంబాబు, పొత్తూరి సత్యనారాయణ రాజు, యనమదల అనూష, పొత్తూరి బాలత్రిపుర సుందరి, సవరపు లక్ష్మి , గేదెల వీరస్వామి నాయుడు ,
బొక్కా లక్ష్మీనారాయణ, రెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు