

టీపీసీసీ సభ్యులు జెబి శౌరి
జనం న్యూస్ 04 (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్)
కొత్తగూడెం ( ) ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులో వివక్ష చూపిన విధానాన్ని నిరసిస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి టీపీసీసీ సభ్యులు, కొత్తగూడెం నియోజకవర్గం కన్వీనర్, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ కన్వీనర్ జేబీ శౌరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం విచారకరమని, 8 మంది బీజేపీ ఎంపీలు కలిసి తెచ్చిన నిధులు గుండు సున్న అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దేశానికి పన్నుల రూపంలో చెల్లించే రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉన్నప్పటికీ, కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే ఉద్దేశ్యంతో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం పట్ల చిన్నచూపు, కక్ష సాధింపు ఉండడం సహజమైనప్పటికి గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రం నుండి ఎనిమిది మంది ఎంపీలుగా గెలిచి, ఇద్దరు కేంద్ర మంత్రులుగా ప్రధాన శాఖలలో ఉండి కూడ తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోవడం సరికాదన్నారు. వారు కళ్ళు లేని కబోదులా లేక కళ్ళు ఉండి చూడలేని గుడ్డి వారా అనేది అర్ధం కాని పరిస్థితి తెలంగాణ ప్రజల్లో ఉందన్నారు. తెలంగాణ నుండి గెలిచిన 8 మంది ఎంపీలకు కచ్చితంగా తెలంగాణ ప్రజలు రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో వారికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి గౌసుద్దీన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్ఎస్.యుఐ అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్, మాజీ వార్డ్ కౌన్సిలర్ తంగెళ్ల లక్ష్మణ్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బిక్షపతి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏలూరు రామదాసు, లక్ష్మణ్, వినయ్, రెడ్డి ఏలియా, గాండ్ల సురేష్, వంశి, దామోదర్, నరసింహారావు, నరేంద్ర, కొత్తగూడెం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జినుగు అరుణ్, కొత్తగూడెం పట్టణ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఉర్సు శివ, యువజన నాయకులు నయీమ్, ఎన్ఎస్.యుఐ నాయకులు ఆదర్శ్, శివ, తరుణ్, తదితరులు పాల్గొన్నారు.