జనం న్యూస్, డిసెంబర్ 17,అచ్యుతాపురం:
మండలం లోని హరిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 36 మంది విద్యార్థులకు విశాఖ డైరీ పిఎస్ శరగడం వరప్రసాదరావు ఆర్థిక సహాయంతో సమకూర్చిన పదో తరగతి స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు సమాజ పురోగతికి నిలయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అనేకమంది అత్యున్నత స్థాయిలో వివిధ హోదాలలో కొనసాగుతున్నారని,వారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులంతా బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు.ఈ సందర్బంగా సీపీఐ జిల్లా కార్యదర్శి దొరబాబు మాట్లాడుతూ ప్రపంచ గతిని మార్చిన అద్భుతమైన ఆయుధం విద్య మాత్రమే అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ రవి, కాండ్రేగుల రమేష్,సీనియర్ టీచర్ పద్మావతి,జనవిజ్ఞాన వేదిక జిల్లా నాయకులు మారిశెట్టి వెంకట అప్పారావు,యూటీఏఫ్ ప్రతినిధి రాము ఉప్పాడ తదితరులు పాల్గొన్నారు.


