

అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే **ఆదినారాయణ
జనం న్యూస్ 04 ఫిబ్రవరి కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ )
నోపా ఆధ్వర్యంలో ముద్రించిన 2025 క్యాలెండర్ ను నోపా సలహాదారులు , ప్రముఖ వ్యాపారవేత్త మల్లెల నరసింహారావు ఆధ్వర్యంలో ఈరోజు మేడారం సమ్మక్క -సారలమ్మ ల సన్నిధిలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా నోపా ద్వారా చేస్తున్న కార్యక్రమాలను నరసింహారావు ద్వారా పరిశీలిస్తున్నానని, నాయి బ్రాహ్మణ సమాజానికి మీలాంటి సంస్థల అవసరం ఎంతో ఉందని, ఇంకా మీ సేవలు విస్తృత పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో నోపా*వ్యవస్థాపక *ఉపాధ్యక్షులు డాక్టర్ లింగంపల్లి దయానంద్ , ఎమ్మెల్యే సతీమణి, మహిళా నాయకురాలు మల్లెల సామ్రాజ్యం, యువ నాయకులు వెంకట దుర్గా ,సాయి దుర్గ, ఉపాధ్యాయులు మచ్చ వెంకటేశ్వర్లు, ఉబ్బనపల్లి వెంకటేశ్వర్లు(మంత్రి) తదితరులు పాల్గొన్నారు.