Listen to this article

కాట్రేనికోన, న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్వా బోర్డు

డైరెక్టర్గా నేడు ప్రమాణ స్వీకారం చేసేందుకు డా బి ఆర్ అంబెడ్క ర్ జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన విత్తనాల నాగ శ్రీనివాస్ (బుజ్జి) మంగళవారం పార్టీ నాయకులతో కలసి కాట్రేనికోన గెట్ సెంటర్ నుండి భయలుదేరారు. కాట్రేనికోన పంచాయతీ పరిధిలోని విత్తనాల బుజ్జి మొదటినుండి తెలుగుదేశం పార్టీలో నమ్మకమైన కార్యకర్తగా పనిచేస్తూ, గ్రామాల్లో పార్టీయొక్క విధి విధానాలు తెలియచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు.కస్టపడిన కార్యకర్తను అక్కున చేర్చుకోవాలనే చంద్రబాబు ఆలోచనతో విత్తనాల బుజ్జి నిబద్దతకు స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పట్టాభిషేకం చేసేందుకు అమరావతికి రమ్మని ఆహ్వానం పంపారు. మంగళవారం ఉదయం టీడీపీ శ్రేణులు కాట్రేనికోన గేట్ సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అమరావతికి పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యశాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు, వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఆకాశం శ్రీనివాస్,మండల తెలుగు యువత అధ్యక్షుడు వంగా దుర్గ బాబు, గెద్దనపల్లి పిఎసిఎస్ అధ్యక్షుడు వనచర్ల నాగేశ్వరరావు, బండారు ఏసు,పి ఎస్ ఎన్ రాజు, వాసంశెట్టి రాజేశ్వరరావు, మోకా అప్పాజీ, నల్లా రామకృష?, విత్తనాల వెంకటరమణ,జంగా శ్రీనివాస్, శీలం సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.