17/12/25, మాగం, అయినవిల్లి మండలం.
ధర్మమే జీవన మార్గమని స్వామి కమలానంద భారతి సందేశం
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం ఉప మండలం మాగం గ్రామంలో ఆర్ఎస్ఎస్ శతవసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన హిందూ సమ్మేళనం భక్తిశ్రద్ధలతో,హిందూ తత్వ సందేశంతో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా హిందూ సమాజ ఐక్యత,సంస్కృతి,ధర్మ పరిరక్షణే లక్ష్యంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త స్వామి కమలానంద భారతి పాల్గొని హిందూ తత్వం,రామాయణం,భారత మహాభారతాలలోని ధర్మ సందేశాన్ని సవివరంగా ఉపన్యాస రూపంలో వివరించారు.కార్యక్రమానికి ముందు కేశనపల్లి,విజయవాడ శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ గాయత్రి మాత మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హిందూ సమ్మేళన వేదికపై భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.శ్రీమతి సయ్యపరాజు సుబ్బలక్ష్మి సత్తిబాబు రాజు అధ్యక్షతన జరగా ముఖ్యఅతిథిగా జడ్పిటిసి మాజీ సభ్యురాలు శ్రీమతి గంగుమళ్ళ కాశీ అన్నపూర్ణ పాల్గొన్నారు.రామాయణంలో శ్రీరాముని ధర్మాచరణ,మహాభారతంలో కృష్ణుడి జీవన సందేశం నేటి సమాజానికి ఎంత ప్రాసంగికమో వివరించిన స్వామి,హిందూ తత్వం అనేది కేవలం ఆచారమే కాక మానవ జీవితాన్ని సత్పథంలో నడిపించే జీవన విధానమని స్పష్టంగా తెలియజేశారు.హిందూ సమాజం ఐక్యంగా నిలిచినప్పుడే సంస్కృతి పరిరక్షణ సాధ్యమవుతుందని,యువత ధర్మ గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారా విలువలతో కూడిన జీవితం నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వేలాదిమంది గ్రామస్థులు,భక్తులు,హిందూ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఉపదేశాలను శ్రద్ధగా ఆలకించారు.హిందూ ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని భావితరాలకు అందించాలనే సంకల్పంతో నిర్వహించిన ఈ సమ్మేళనం హిందూ సమాజానికి ఆధ్యాత్మిక స్ఫూర్తినిచ్చిందని నిర్వాహకులు ఆర్ఎస్ఎస్ ప్రధాన వక్త కోమరగిరి వెంకట ఆనంద్ సాంగ్ సంఘ జయంతి సందర్భంగా చేస్తున్న చేస్తున్న కార్యక్రమాలను విధివిధానాలను వివరించారు.చేకూరి మరిడి రాజు,ఆర్ఎస్ఎస్ రాష్ట్ర,జిల్లా,మండల, ఉప మండల ప్రతినిధుల, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు



